బోధన్ మాజీ MLA షకీల్ తనయుడు రాహిల్(Rahil) నేరాల చిట్టాను పోలీసులు జల్లెడ పడుతున్నారు. పాత కేసును తిరగదోడి కొత్త సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ప్రజాభవన్ ను ఢీకొట్టిన కేసులో ఇప్పటికే అరెస్టు కాగా.. రెండేళ్ల క్రితం 2022లో జరిగిన రోడ్ యాక్సిడెంట్లో రెండు నెలల(Two Months) చిన్నారితోపాటు ముగ్గురు గాయాల పాలయిన ఘటనను రీ-ఓపెన్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు-45లో జరిగిన ఈ ఘటనలో అసలు నిందితుడు మాజీ MLA కుమారుడేనన్న నిర్ణయానికి వచ్చి నిందితుడిగా చేర్చారు.
ఈమధ్యకాలంలో…
గత డిసెంబరు 23న అర్ధరాత్రి ప్రజాభవన్ బారికేడ్లను కారుతో ఢీకొట్టిన(Accident) ఘటనలో రాహిల్ పై కేసు ఫైల్ కావడం, పోలీసుల గాలింపుతో దుబాయి పారిపోవడం, పట్టుకునేందుకు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో దుబాయ్ నుంచి తిరిగిరాగానే నిందితుణ్ని అరెస్టు చేశారు. ఇందులోనూ తన పేరు మార్చుతూ రాహిల్ కు బదులు అతడి ఇంట్లో పనిచేసే ఆసిఫ్ పేరును చేర్చారు. పంజాగుట్ట CI దుర్గారావు సహకరించారంటూ అతణ్ని అరెస్టు చేసిన పోలీసులు.. బోధన్ CIగా పనిచేసిన వ్యక్తిని సస్పెండ్ చేశారు. PSలోని 85 మందిని CP శ్రీనివాస్ రెడ్డి బదిలీ చేశారు.
ఆనాటి ఘటనలో…
మహారాష్ట్రకు చెందిన బాధితులు 2022 ఫిబ్రవరి 17న రాత్రి 8 గంటలకు ఫుట్ పాత్ పై నుంచి డివైడర్ దాటుతున్న టైంలో.. రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి వచ్చిన థార్ వెహికిల్ వేగంగా ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్లో ముగ్గురికి గాయాలైతే ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఉన్న ముగ్గురు పరారైతే సదరు వెహికిల్ కు MLA స్టిక్కర్ ఉండటం అప్పట్లో సెన్సేషనల్ గా మారింది. కారు నడిపింది తానేనంటూ ఆఫ్రాన్ అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు.
సెక్షన్లు మార్చి…
304(a), 337 సెక్షన్ల కింద అప్పట్లో కేసు నమోదు చేశారు. బాధితుల(Victims) నుంచి మరోసారి వాంగ్మూలం(Statement) తీసుకున్న పోలీసులు.. 304(a) సెక్షన్ ను మార్చి 304 పార్ట్-2 కింద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అప్పుడు లొంగిపోయిన ఆఫ్రాన్ సైతం తన బంధువుల ఒత్తిడి వల్లే అలా చేశానన్న వార్తలు వినపడ్డాయి. నాటి పోలీసు అధికారుల పాత్రపైనా పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి దృష్టిపెట్టారు.