జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడటంతో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. కిష్ట్వార్ నుంచి జమ్మూ వెళ్తుండగా దోడా జిల్లాలో అదుపు తప్పి 300 అడుగుల లోయలో పడటంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. బటోట్-కిష్ట్వార్ జాతీయ రహదారిపై తృంగల్-అస్సార్ సమీపంలో దుర్ఘటన జరిగింది. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొని బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. ప్రాణాలు కోల్పోయిన 25 మంది మృతదేహాలను మార్చురీకి తరలించారు.