బస్సు నదిలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 24 మందికి గాయాలైన ఘటన ఝార్ఖండ్ లో జరిగింది. ప్రమాదం(Incident) జరిగిన సమయంలో వాహనంలో 30 మందికి పైగా జర్నీ(Journey) చేస్తున్నారు. నదిలో నీళ్లు ఎక్కువగా లేకపోవడంతో చాలా మంది గాయాలతో బయటపడ్డారు. రాజధాని రాంచీ నుంచి బస్సు గిరిధ్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డుమ్రీ పట్టణానికి సమీపంలోని బరాకర్ నది బ్రిడ్జిపై నుంచి రాత్రి పూట బస్సు అందులో పడిపోయింది. బాధితుల అరుపులు విని స్థానికులు అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి గాయపడ్డ పలువురిని హాస్పిటల్ కు తరలించారు.