పుష్ప-2 బెనిఫిట్ షో తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 18 మందిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. అల్లు అర్జున్ తోపాటు నిర్మాతలు, పర్సనల్ మేనేజర్లు, సెక్యూరిటీ గార్డులు, థియేటర్ ఓనర్లు, వాటి భాగస్వాములు(Partners), థియేటర్లో బాధ్యతలు చూసే వ్యక్తుల్ని ఇందులో నిందితులుగా చేర్చారు. రేవతి మృతికి ఈ 18 మంది నిర్లక్ష్యమే కారణమంటూ A1 నుంచి A18గా అందరి పేర్లను పోలీసులు చేర్చారు. ఇప్పటికే అర్జున్ పై మూడున్నర గంటలపైగా విచారణ నిర్వహించగా.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి.
కేసు ఫైల్ అయిన 18 మంది వీరే…
ఎ.పెద్దిరామిరెడ్డి(థియేటర్ ఓనర్) – A1
ఎ.చిన్నరామిరెడ్డి(థియేటర్ ఓనర్) – A2
ఎం.సందీప్(థియేటర్ భాగస్వామి) – A3
సోమేశ్(థియేటర్ భాగస్వామి) – A4
ఎ.వినయ్ కుమార్(థియేటర్ ఓనర్) – A5
ఎ.అశుతోష్ రెడ్డి(థియేటర్ ఓనర్) – A6
ఎం.రేణుక(థియేటర్ భాగస్వామి) – A7
ఎ.అరుణారెడ్డి(థియేటర్ భాగస్వామి) – A8
నాగరాజు(మేనేజర్) – A9
విజయ్ చందర్(లోయర్ బాల్కనీ ఇంఛార్జ్) – A10
అల్లు అర్జున్ – A11
సంతోశ్ కుమార్(అల్లు అర్జున్ పర్సనల్ మేనేజర్) – A12
శరత్ బన్నీ(అల్లు అర్జున్ మేనేజర్) – A13
రమేశ్(అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్) – A14
రాజు(అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్) – A15
వినయ్ కుమార్(అభిమాన సంఘం) – A16
ఫర్వేజ్(బాడీ గార్డ్) – A17
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు – A18