కమలం పార్టీ(BJP) హైదరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై కేసు నమోదైంది. పోలింగ్ కేంద్రంలో ముస్లిం మహిళతో జరిగిన వాగ్వాదాన్ని ఎన్నికల సంఘం అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ముస్లిం మహిళల వివరాల్ని ఆమె అడిగి తెలుసుకుంటున్న సమయంలో విచిత్ర సంఘటన జరిగింది.
అలా అందరినీ పరిశీలిస్తున్న సమయంలో అనుమానం వచ్చి ఓటరును గుర్తించేందుకు బుర్ఖా తీయమన్నారు మాధవీలత. ఈ విషయంలో వివాదం ఏర్పడటంతో ఎలక్షన్ కమిషన్ స్పందించింది. మాధవీలతపై కేసు ఫైల్ చేసినట్లు హైదరాబాద్ కలెక్టర్ ప్రకటించారు. IPC సెక్షన్ 171C, 186, 505(1)(c)తోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద ఆమెపై మలక్ పేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.