ఎన్నికల ప్రచారం(Election Campaign) సందర్భంగా వృద్ధురాలికి రూ.500 ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాజీ మంత్రిపై ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి, వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖపై వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది. 36వ డివిజన్ లో ఇటీవల ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆరు గ్యారంటీ పథకాల పేపర్ తోపాటు రూ.500ను వృద్ధురాలికి అందించిన వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
ఓటరును ప్రలోభాలకు గురిచేసినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు మంగళవారం వరంగల్ జిల్లాలో కేసు నమోదు చేశారు.