
మా ఊరికి మంత్రి వచ్చారంటూ మంగళహారతి పడితే.. అందులో డబ్బులు వేయడం వివాదానికి కారణమైంది. ఇది కోడ్ ఉల్లంఘనే అంటూ సదరు రాష్ట్ర మంత్రిపై ఎన్నికల సంఘం అధికారుల కంప్లయింట్ తో కేసు నమోదైంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పై మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్న కోణంలో ఎన్నికల FST(Flying Surveillance Team).. మంత్రి తీరును సునిశితంగా పరిశీలించి నిజమేనని గుర్తించింది.
BRS అభ్యర్థి శంకర్ నాయక్ తరఫున ప్రచారంలో భాగంగా ఆమె కొంగరగిద్ద గ్రామానికి వెళ్లారు. మంత్రి మా ఊరికి వచ్చారంటూ అక్కడి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆ మంగళహారతి పళ్లెంలో రూ.4.000 వేలను మంత్రి వేయడంతో ఎన్నికల నిఘా బృందం గమనించింది. ఇది ఓటర్లను ప్రలోభపెట్టడమేనంటూ గుర్తించి గూడూరు పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చింది.