నెల రోజుల్నుంచి ఎటు చూసినా ఒకటే సందడి.. మీడియా, సోషల్ మీడియాల్లో చర్చంతా అంబానీ కుటుంబాని(Ambani Family)దే. ప్రపంచ కుబేరుడైన ముకేశ్ అంబానీ.. తన తనయుడు అనంత్ వివాహాన్ని ఎంత ఆడంబరంగా చేశారో చూశాం. ప్రపంచంలోని అగ్రనేతలు, బడా కార్పొరేట్లు, సెలెబ్రిటీల రాకతో అంబానీ ఇల్లంతా తళుకుబెళుకులతో మెరిసిపోయింది.
తాము కూడా…
ఇంతమంది వస్తున్న వేడుకకు తామెందుకు వెళ్లకూడదనుకున్నారో ఏమో గానీ ఆంధ్రప్రదేశ్(AP) నుంచి ఇద్దరు వ్యక్తులు అంబానీ ఇంటి వద్దకు చేరుకున్నారు. కానీ ఎలాంటి పర్మిషన్ లేదని తేలడంతో ఆ ఇద్దరిపైనా కేసులు పెట్టారు అక్కడి పోలీసులు.
వెంకటేశ్ నర్సయ్య, మహ్మద్ షఫీ అనే ఇద్దరిపై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ ఇద్దరికీ నోటీసులిచ్చి తర్వాత వదిలిపెట్టగా.. ఆ పెళ్లి ఏమో గానీ ఈ ఇద్దరూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.