అక్రమాలకు పాల్పడే వారిని అరెస్టు చేయాల్సిన కస్టమ్స్ అధికారులే తప్పుడు పనులకు పాల్పడినట్లు గుర్తించి CBI వారిని అరెస్టు చేసింది. హైదరాబాద్ శంషాబాద్(Shamshabad) విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.
కొద్దిసేపటి క్రితం ఇద్దరు మాజీ సూపరింటెండెంట్లు, ఒక CI స్థాయి అధికారిని CBI అరెస్టు చేసి తీసుకెళ్లింది. అంతర్జాతీయ ప్రయాణికులతో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు జూన్ 8న వీరిపై కేసు నమోదైంది.
విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సహకరించినట్లు గుర్తించిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. శ్రీనివాసులు, పంకజ్ గౌతమ్, చక్రపాణిల్ని అదుపులోకి తీసుకుంది. అంతేకాకుండా వారి నివాసాలు(Residences), కార్యాలయాల్లో CBI అధికారులు సోదాలు నిర్వహించారు.