కోల్ కతాలో యువ డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడ్డ కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు జూనియర్, సీనియర్ డాక్టర్ల ప్రమేయం ఉందని బాధితురాలి తల్లిదండ్రులు CBI దర్యాప్తులో చెప్పారు. కొన్ని పేర్లను సైతం బయటపెట్టారని, బాధితురాలితో కలిసి పనిచేసిన వ్యక్తులే ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనలో 30 మందిని విచారించాలని CBI నిర్ణయించింది. ఆసుపత్రి వైద్యులతోపాటు పోలీసు అధికారుల్ని కూడా విచారించబోతుండగా.. హత్య జరిగిన రోజు డ్యూటీలో ఉన్న స్టాఫ్ కు కూడా సమన్లు జారీ అవుతున్నాయి. హత్యకు గురైన రూంలో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని ఓ విచారణ కమిటీ ఆరోపించింది. హత్య సంగతి బయటపడగానే ఆ రూమును కొందరు శుభ్రం చేసిందని చెప్పింది.
అటు హాస్పిటల్ విధ్వంసం(Vandalism) కేసులో ఇప్పటిదాకా 25 మందిని అరెస్టు చేసినట్లు కోల్ కతా పోలీసులు తెలిపారు. IMA పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా OP సేవలు(Non-Emergency) నిలిచిపోయాయి. CM మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.