దేశంలో వైద్య విద్యా వ్యవస్థ ఎలా కుళ్లిపోయిందో కళ్లకు కట్టింది CBI. ఓ స్వామీజీ, ఉన్నతాధికారులు, మధ్యవర్తులు సహా 35 మందిది కీలక పాత్ర అని ఛార్జిషీట్ లో తెలిపింది. రాజస్థాన్, గుర్గావ్, ఇండోర్, వరంగల్, విశాఖకు విస్తరించిన కోట్లాది రూపాయల స్కామ్.. రాయ్ పూర్లోని శ్రీరావత్ పురా సర్కార్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ అండ్ రీసెర్చ్(SRIMSR) ద్వారా బయటపడింది. తమకు అనుకూల తనిఖీలు ఉండేలా రూ.55 లక్షలు ఇచ్చారన్న కేసులో డాక్టర్లు సహా ఆరుగురు అరెస్టయ్యారు. UGC మాజీ ఛైర్మన్, ప్రస్తుత TISS ఛాన్సలర్ డి.పి.సింగ్, స్వామీజీ రావత్ పురా సర్కార్(రవిశంకర్ మహరాజ్), (RERA) మాజీ ఛైర్మన్, IFS అధికారి సంజయ్ శుక్లా, మెడికల్ అసెస్మెంట్ బోర్డులో పనిచేసే జితులాల్ మీనాకు సంబంధాలున్నట్లు CBI తెలిపింది.
దేశవ్యాప్తంగా 40కి పైగా కాలేజీలు లంచాలతో రికార్డుల్ని తారుమారు చేశాయని CBI గుర్తించింది. స్వామీజీకి బడా నేతలు, IAS, IPSలతో సాన్నిహిత్యముంది. భూ ఆక్రమణలు, అనుమతి లేని కాలేజీలు, మహిళా అనుచరుల్ని వేధించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. నకిలీ స్టాఫ్, బయోమెట్రిక్ మోసాలతో ప్రైవేట్ సంస్థల నుంచి రూ.3 నుంచి 5 కోట్లు వసూలు చేశారని CBI అనుమానిస్తోంది.