దేశవ్యాప్తంగా జరుగుతున్న బంగారం అక్రమ రవాణా(Smuggling)పై CBI… అన్ని విమానాశ్రయాల్లో దాడులు చేస్తోంది. స్మగ్లింగ్ కేసులో కన్నడ సినీ నటి రన్య రావును DRI(డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) పట్టుకుంది. DRI నుంచి వివరాలు సేకరించిన CBI.. బెంగళూరులోని రన్యరావు నివాసంలో సోదాలు జరిపింది. కర్ణాటక DGP(పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్) రామచంద్రారావుకు కూతురు వరుస అయిన రన్య.. ఏడాదిలో 30 సార్లు దుబాయి వెళ్లి వచ్చింది. గత 15 రోజుల్లోనే 4 సార్లు వెళ్లిరాగా, ప్రతిసారీ కిలోల బంగారం వెంట తెచ్చినట్లు గుర్తించారు. ఈవారంలోనే బెంగళూరు ఎయిర్పోర్టులో ఆమెను అరెస్టు చేసి 14.2 కిలోల గోల్డ్ ను సీజ్ చేశారు. రన్య భర్త జతిన్ హుక్కెరిని విచారిస్తున్నారు. 4 నెలల క్రితమే హుక్కెరిని పెళ్లాడిన రన్య.. వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించింది.