బీఆర్ఎస్ MLC కల్వకుంట్ల కవితకు ఇప్పటికే కోర్టు నుంచి షాక్ మీద షాక్ తగులుతుండగా ఇప్పుడు ఆమె వివరాల్ని CBI బయటపెట్టింది. తమ కస్టడీకి కోరుతూ రౌస్ అవెన్యూ న్యాయస్థానంలోని CBI స్పెషల్ కోర్టులో పిటిషన్ వేయగా న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. అయితే మద్యం(Liquor) కేసులో కవిత కీలక సూత్రధారి(Key Mastermind), పాత్రధారి(Role) అని CBI స్పష్టం చేసింది. విజయ్ నాయర్ తోపాటు పలువురితో కలిసి ఆమె ఢిల్లీ, హైదరాబాద్ లో మీటింగ్ లు పెట్టి ప్లాన్ తయారు చేశారని తెలిపింది.
ఆడిటర్ వాంగ్మూలంతో…
లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర సుస్పష్టమని ఆమె ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలమిచ్చారని, సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు కలెక్ట్ చేసి ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ నేతలకు అందజేసినట్లు CBI వివరించింది. కవిత సూచనల(Instructions)తోనే తాను రూ.25 కోట్లు అందించినట్లు వాంగ్మూలంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి చెప్పారని, వాట్సాప్ ఛాటింగ్ ద్వారా ఈ విషయాల్ని గుర్తించామంది.
కోర్టుకు ఛాట్…
మనీ లాండరింగ్ వ్యవహారంలో కవిత ఇతరులతో సాగించిన వాట్సాప్ ఛాటింగ్ వివరాల్ని న్యాయస్థానికి CBI అందజేసింది. ఇప్పటివరకు తీసుకున్న వాంగ్మూలాలు, సేకరించిన వాట్సాప్ ఛాట్స్ వివరాల్ని కోర్టుకు అధికారులు సమర్పించారు. 2021 మార్చి, మే నెలల్లో ఈ తతంగం నడిపినట్లు తెలిపారు.