ఢిల్లీ మద్యం కుంభకోణం(Liquor Scam)లో తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే పలు మార్లు ఈడీ(Enforcement Directorate) సమన్లు అందుకున్న మాజీ ముఖ్యమంత్రి తనయ కల్వకుంట్ల కవిత.. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) నోటీసుల్ని కూడా అందుకోవాల్సి వచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ CBI ఆమెకు సమన్లు పంపింది. వచ్చే వారం విచారణకు రావాల్సి ఉంటుందని అందులో తెలియజేసింది. తొలిసారి ఆమె గతేడాది మార్చి 11న ఢిల్లీలోని ED కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
ఇప్పటికే సుప్రీంకోర్టులో…
మహిళలను దర్యాప్తు సంస్థలు ఇళ్లల్లోనే విచారించాలంటూ BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంతకుముందే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 28న జరగనుంది. లిక్కర్ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ పంపిన సమన్లను ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆమె పిటిషన్ ను మరో ఇద్దరైన నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీల కేసులకు జత చేయగా.. ఆయా పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపడతామని తాజాగా ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం(Devision Bench) కవిత కేసుపై విచారణ చేపట్టనుంది. 3 కేసులు వేర్వేరని స్పష్టం చేసిన బెంచ్.. వాటన్నింటిని కలిపి విచారణ చేయడం సబబు కాదని అభిప్రాయపడింది.
కేసు పూర్వాపరాలిలా…
APకి చెందిన YCP ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బినామీలైన అరుణ్ రామచంద్ర పిళ్లై, ప్రేమ్ రాహుల్ కు చెందిన సౌత్ గ్రూప్ ద్వారా… ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు చెల్లించి మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా ఉండేలా కల్వకుంట్ల కవిత ప్రభావితం చేశారన్నది ED అభియోగం. చట్ట ప్రకారం మహిళల్ని ఇంట్లోనే విచారించాల్సి ఉన్నా ED ఆఫీసుకు పిలవడాన్ని సవాల్ చేస్తూ కవిత.. 2023 మార్చి 14న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.