కేటీఆర్ A1గా నమోదైన ఫార్ములా ఈ-రేస్ కేసులో మరో పెద్ద సంచలనం ఏర్పడింది. ఈ కేసును ఇప్పటిదాకా ACB డీల్ చేస్తుండగా.. ఇప్పుడు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలంటూ ACBకి ED లేఖ రాసింది. ACB ఫైల్ చేసిన FIR కాపీతోపాటు నిధుల బదలాయింపు పత్రాలు అందివ్వాలని కోరింది. వివరాలు ఈరోజు సాయంత్రం వరకు అదించాలని కోరగా.. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత ED దర్యాప్తు మొదలయ్యే అవకాశముంది. ఈ-రేస్ వ్యవహారంలో రూ.54.88 కోట్ల మేర అక్రమాలు జరిగాయని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఇప్పటికే కంప్లయింట్ ఇచ్చారు. దీనిపైనా దృష్టిపెట్టిన ED అధికారులు… అటు ACBతోపాటు దానకిశోర్ నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. కేటీఆర్ పై నమోదు చేసిన సెక్షన్లను బట్టి ఆర్థిక లావాదేవీల్లో నేరాభియోగాల తీరును బట్టి ED ఇన్వెస్టిగేషన్ చేపట్టవచ్చు. PMLA(ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్) కింద కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు జరపనుంది.