అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నిఘాను పటిష్ఠం చేసేందుకు జగిత్యాల జిల్లాలో 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో(Border Areas) గోదావరి తీరం(Godavari Belt) ఉన్నందున ఆయా ఏరియాలన్నీ నిఘా నీడలో ఉండనున్నాయి. నగదు, మద్యం, ఇతర తాయిలాలను అరికట్టేందుకు ఈ చెక్ పోస్టుల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా పొలిమేరలైన నిజామాబాద్ వైపు గండి హన్మాన్, నిర్మల్ వైపు ఓబులాపూర్ వద్ద వీటిని అందుబాటులోకి తెచ్చారు. SP ఎగ్గడి భాస్కర్ స్వయంగా చెక్ పోస్టులను ప్రారంభించారు.
రాకపోకలు సాగించే వాహనాల్ని క్షుణ్నంగా తనిఖీ చేయడంతోపాటు అనుమానితులను అణువణువు అబ్జర్వ్ చేయాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద పరిస్థితిని పర్యవేక్షించేందుకు, అక్కడి దృశ్యాలను చూసేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లో CC కెమెరాలను అమర్చారు. SP వెంట DSP రవీంద్ర కుమార్, మెట్ పల్లి CI లక్ష్మీనారాయణ, SIలు చిరంజీవి, ఉమాసాగర్ తదితరులు ఉన్నారు.