చిన్నారుల అక్రమ రవాణా(illegal transport)కు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి.. పిల్లల్ని పోలీసులు కాపాడిన ఘటన గుంటూరులో జరిగింది. ఆ ముఠా నుంచి 19 మంది బాలల్ని రక్షించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. బిహార్ కు చెందిన చిన్నారులను నంద్యాల తరలిస్తున్నారన్న సమాచారంతో గుంటూరు రైల్వే స్టేషన్ కు చేరుకున్న పోలీసులు… కాపు కాసి ఆచూకీని గుర్తించారు. రైల్వే పోలీసులు, చిల్ట్రన్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్, బచ్ పన్ బచావోతో మానవ అక్రమ రవాణా నిర్మూలన సిబ్బంది… జాయింట్ ఆపరేషన్ నిర్వహించి చిన్నారుల్ని కాపాడారు.
గుంటూరులోని ఓపెన్ షెల్టర్ లో ఉంచి వారికి ఆశ్రయం కల్పించిన అధికారులు.. తల్లిదండ్రులను పిలిపించిన తర్వాత వారికి అప్పగిస్తామని తెలిపారు.