ఫోన్ల ట్యాపింగ్(Phone Tapping) అనేది ఇప్పటిదాకా రాజకీయ ప్రత్యర్థులు, తమకు అడ్డుగా ఉన్నవారు లేదా సొంత పార్టీలోని అసమ్మతి వాదులపై జరిగినట్లు ఇప్పటిదాకా భావించారంతా. కానీ డబ్బు వసూళ్ల(Collections)కు కూడా ఈ అస్త్రాన్ని ఉపయోగించారని ఇప్పుడు బయటపడింది. ఫోన్లను ట్యాప్ చేస్తూ తమను బెదిరించి మరీ డబ్బులు వసూలు చేశారంటూ పలువురు వ్యాపారులు(Businessmen) కంప్లయింట్ ఇచ్చారు.
రాధాకిషన్ రావుపై…
ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన టాస్క్ ఫోర్స్ మాజీ అధికారి రాధాకిషన్ రావు బెదిరించి డబ్బు తీసుకున్నారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యక్తి.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు(Complaint) చేశారు. ఈ కేసుపై ఇప్పటికే విచారణ జరుపుతున్న బంజారాహిల్స్ పోలీసులు.. శ్రీధర్ ను పిలిపించుకున్నారు. తన ఇంటికి వచ్చి మరీ కోట్ల రూపాయల డబ్బు తీసుకెళ్లారన్న వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్నారు. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ మాజీ OSD(Officer On Special Duty) రాధాకిషన్ రావు అక్రమాలు బయటకు వచ్చాయి.
లెక్కలేనన్ని…
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీ(Main Party)కి అనుకూలంగా టాస్క్ ఫోర్స్(Taskforce) వెహికిల్స్ లోనే డబ్బును తరలించినట్లు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ లో గుర్తించారు. రాష్ట్రంలోని పలు సెగ్మెంట్లకు హైదరాబాద్ నుంచి డబ్బు పంపే కార్యక్రమాన్ని రాధాకిషన్ రావు టీమే ఇలా పోలీసు వాహనాల్లో అమలు చేసిందని తేల్చారు. ఇలా ఇప్పటిదాకా నాయకులు, ఎన్నికల కోసమే ఫోన్ల ట్యాపింగ్ వాడారని భావిస్తున్న పరిస్థితుల్లో… బడా, బడా వ్యాపారుల్ని సైతం భయపెట్టి డబ్బులు వసూలు చేశారని తాజాగా బయటపడటం సంచలనానికి కారణమైంది.