కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ MP సజ్జన్ కుమార్ ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఆయన్ను నేరస్థుడిగా నిర్ధారించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ(Rouse Avenue) కోర్టు.. సుదీర్ఘ విచారణల అనంతరం తీర్పును ప్రకటించింది. జనవరి 31న తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి కావేరి బవేజా.. ఈనెల 18న శిక్షను ప్రకటించనున్నారు.
నాడు ఏం జరిగిందంటే…
1984, నవంబరు 1న జశ్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ ఢిల్లీలోని సరస్వతి విహార్ ప్రాంతంలో హత్యకు గురయ్యారు. మాజీ ప్రధాని ఇందిర హత్యకు ప్రతీకారంగా పెద్దయెత్తున దోపిడీలు, దహనాలతో సిక్కుల్ని టార్గెట్ చేశారు. ఇంట్లో వస్తువుల్ని దోచుకుని, ఇల్లు తగులబెట్టి తన భర్త, తనయుణ్ని చంపినట్లు జశ్వంత్ భార్య ఫిర్యాదు చేశారు. అదే ఏడాది ఢిల్లీలో 2,700 మంది సిక్కులు హత్యకు గురయ్యారని న్యాయవాది వాదించారు. 2021 డిసెంబరు 16న సజ్జన్ పై సాక్ష్యం నమోదైంది.