ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు న్యాయస్థానం(Court) మరోసారి కస్టడీ విధించింది. 14 రోజుల పాటు వచ్చే నెల 12 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో ఆయన తిహార్ జైలుకే పరిమితం కానున్నారు.
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ కు మొన్న రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ED అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు రిజర్వ్ చేసిన పరిస్థితుల్లో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరించింది.
ఆయనకు బెయిల్ ఇవ్వడం సరికాదంటూ ఢిల్లీ హైకోర్టు ఆయన్ను తొలుత మూడు రోజుల కస్టడీకి ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.