
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(High Court)లో ఊరట లభించింది. సరైన ఆధారాలు లేవంటూ ఆయన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. గంగుల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ పై వాదనలు కొనసాగాయి. 2018 ఎన్నికల్లో ఎన్నికల సంఘం(Election Commission) నిర్ధారించిన వ్యయానికన్నా ఎక్కువగా గంగుల ఖర్చు చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు.