అక్రమాలకు పాల్పడి IAS సాధించిన మహారాష్ట్ర కేడర్ ట్రెయినీ(Trainee) పూజ ఖేడ్కర్ పై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనను ఢిల్లీ పాటియాలా(Patiala) హౌజ్ కోర్ట్స్ తోసిపుచ్చింది. తప్పుడు(Fake) సర్టిఫికెట్లతో సివిల్స్ పాసయ్యారన్న ఆరోపణలపై ఛీటింగ్, ఫోర్జరీ కేసుల్ని UPSC వేయడంతో.. ఇక అరెస్టు తప్పదన్న ఉద్దేశంతో ఆమె కోర్టు మెట్లెక్కింది.
పూజ పిటిషన్ను తిరస్కరించిన పాటియాలా హౌజ్ కోర్ట్స్ సెషన్స్ జడ్జి దేవేంద్ర కుమార్ జంగాల.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలంటూ ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. OBC కోటా సహా దివ్యాంగ సర్టిఫికెట్ సమర్పించడం వంటి కారణాలపై కూలంకష దర్యాప్తు జరపడంతోపాటు UPSCలో ఎవరైనా ఆమెకు సహకరించారా అన్న కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ సాగాలని ఆదేశాలిచ్చారు.