న్యాయవ్యవస్థ(Judiciary)ను కించపరిచే విధంగా వ్యవహరించిన పలువురిపై న్యాయస్థానం(Court) చర్యలు తీసుకుంటోంది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు.. కోర్టు ధిక్కరణ పిటిషన్ తో పలువురికి నోటీసులు జారీ చేసింది. న్యాయవాది దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై వేగంగా చర్యలు చేపడుతున్నది. చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడంతోపాటు కామెంట్లు చేశారు. దీనిపై ఇప్పటికే రాష్ట్రపతికి కంప్లయింట్ ఇవ్వగా.. చర్యలు తీసుకోవాలని ద్రౌపదీ ముర్ము ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో AP హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ నమోదైంది. న్యాయమూర్తులను కించపరిచేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు.
26 మందికి నోటీసులు
ఈ కేసు ఈరోజు విచారణకు రాగా.. AP ఉన్నత న్యాయస్థానం చర్యల(Action)కు ఉపక్రమించింది. జడ్జిలపై దూషణ కేసులో 26 మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. TDP నేతతోపాటు 26 మందికి నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందించాలని AP DGPని కోర్టు ఆదేశించింది.