TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు మరో నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈమధ్య మహ్మద్ ఖాలిద్ అనే నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడంతో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 51 అయింది. మహ్మద్ ఖాలిద్ ను తమ కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లి కోర్టులో సిట్ పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన కోర్టు ఖాలిద్ ను 3 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లీకేజీ వ్యవహారంలో ఖాలిద్ ఎంత డబ్బు తీసుకున్నాడనే వివరాలు సేకరిస్తున్నారు.