సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఏటికేడు పెరిగిపోతూనే ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న మోసాల వల్ల గత రెండేళ్లలో రూ.587 కోట్లు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2021 జులై నుంచి 2023 జూన్ వరకు బాధితులు ఈ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నట్లు జాతీయ సైబర్ నేరాల పోర్టల్(ఎన్సీఆర్పీ) తెలిపింది. సైబర్ నేరాల పోర్టల్ కు తెలంగాణ నుంచి నిత్యం 700 కాల్స్ వస్తున్నాయని, ఈ రెండేళ్లలో 1,27,144 ఫిర్యాదులు అందాయని పేర్కొంది. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు.. నేరస్థుల బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేస్తున్నారు. తద్వారా ఈ రెండేళ్లలో 12.01 లక్షల సొమ్మును నష్టపోయినవారికి తిరిగి ఇప్పించగలిగారు.