
కొత్త టెక్నాలజీతో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. 2023లో రూ.7,465 కోట్లు కొల్లగొడితే అది 2024లో రూ.22,845 కోట్లకు పెరిగింది. 2022లో 10,29,026, 2023లో 15,96,493, 2024లో 23 లక్షల కేసులు నమోదయ్యాయి. ఆన్లైన్ గేమ్స్, క్యాసినోలు, క్రిప్టో, డిజిటల్ అరెస్టులు, అమాయకత్వం, కామం, భయం, ఒంటరితనాలే వీక్ నెస్ అవుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల 15 జిల్లాల్లోని మారుమూల పల్లెల నుంచే సైబర్ దాడులుంటున్నాయి.
www.cybercrime.gov.inలో కంప్లయింట్ ఇవ్వొచ్చు. టోల్ ఫ్రీ నంబరు 1930కి ‘గోల్డెన్ అవర్’గా పిలిచే గంటలోపు ఫోన్ చేయాలి. నేషనల్ పోలీస్ హెల్ప్ లైన్ నంబరు 112, నేషనల్ వుమెన్ హెల్ప్ లైన్ నంబర్ 181 అందుబాటులో ఉన్నాయి.