ఎంత చెప్పినా వినకుండా సోషల్ మీడియా(Social Media) రీల్స్ చేస్తున్న కూతుర్ని కాల్చి చంపాడో తండ్రి. ఆమె టెన్నిస్ ప్లేయర్ కాగా, రాష్ట్రస్థాయిలో పలు టోర్నీలు గెలిచింది. గురుగ్రామ్(Gurugram)లోని సుశాంత్ లోక్ ఫేజ్-కు చెందిన 25 ఏళ్ల రాధికా యాదవ్ పై ఆమె తండ్రి ఐదు బుల్లెట్లు పేల్చాడు. అందులో మూడు ఆమెకు తగిలి ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. రీల్స్ ఆపేయాలని తండ్రి చెప్పడంతో ఇంట్లో గొడవ మొదలైంది. కోపంతో లైసెన్సుడ్ రివాల్వర్ పేల్చాడు. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్(ITF) డబుల్స్ ప్లేయరైన రాధిక ర్యాంకు 113.