అతివేగం(Speed) ఒకరి ప్రాణాలు తీసింది. 25 ఏళ్ల నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒకరు అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. హైదరాబాద్ గచ్చిబౌలి(Gachibowli)లోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై న ఈ ఘటన చోటుచేసుకుంది. డివైడర్ ను ఢీకొట్టి ఒక ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైఓవర్ పై పడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం పొద్దున మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న యువకులు వంతెన పైనుంచి ఎగిరిపడ్డారు. సదరు బైక్ పై ఇద్దరు వెళ్తుండగా అందులో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
గాయపడ్డ మరో వ్యక్తిని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న మధుగా గుర్తించారు.