ఈసారి వచ్చిన వరదలు అపార ప్రాణ నష్టాన్ని కలిగించాయి. వరద నుంచి ఇంకా తేరుకోకపోవడంతో ఎంతమంది విగతజీవులుగా కనిపిస్తారోనన్న ఆందోళన ఏర్పడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా(Erstwhile Warangal)లో ఇప్పటివరకు ఫ్లడ్ బారిన పడి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇప్పటిదాకా 19 మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం రెస్క్యూ టీమ్స్(Rescue Teams) గాలింపు జరుపుతున్నాయి. మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నారు. కేవలం జంపన్నవాగు ఉద్ధృతిలోనే మొన్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంచుమించు అన్ని ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ నదుల్లా కనిపించాయి. రోజూ వేల సంఖ్యలో వాహనాలు తిరిగే రోడ్డుపై బోట్లలో తిరగాల్సి వచ్చింది. ఎక్కడికక్కడ చెరువులు, కాల్వలు తెగిపోయి నీరంతా నగరాన్ని చుట్టుముట్టింది. అటు భద్రకాళి చెరువుకు గండి పడి పలు కాలనీల్లోకి నీరు చేరింది. మేజర్ సిటీల్లో ఆస్తి నష్టం జరిగితే… రూరల్, ఏజెన్సీ ఏరియాల్లో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది.