మద్యం కుంభకోణం(Liquor Scam) కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ మీద షాక్ తగులుతున్నది. ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ పై ఉత్తర్వుల్ని రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు.. తాజాగా ఆ వివరాలు వెల్లడించింది. ఆయన బెయిల్ పై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు.. ఈనెల 20న కింది కోర్టు బెయిల్ ఇచ్చింది.
సుప్రీంలోనూ దెబ్బ…
దీనిపై ED అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం బెయిల్ ఉత్తర్వులపై స్టే విధిస్తూనే ఈనెల 21న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పరిణామంపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు రిజర్వ్ ను అసాధారణ నిర్ణయంగా భావించిన సుప్రీం.. రేపు విచారణ జరుపుతామని, ఆలోపు హైకోర్టు తీర్పు కూడా వస్తుందని చెప్పింది. ఇలా సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.