
వారంతా ఉన్నతస్థాయిలో ఉన్న డాక్టర్లు. పైకి మెడలో స్టెథస్కోప్ వేసుకున్నా లోపల అంతా ఉగ్రవాద రూపమే. ఒక డాక్టర్ ని పట్టుకుంటే అందరూ దొరికిపోయారు. దేశంలో అలజడి రేపేందుకు 2,913 కిలోల పేలుడు పదార్థాలు, అసాల్ట్ రైఫిళ్లు, హ్యాండ్ గన్లు, మేగజైన్లు భారీస్థాయిలో దొరికాయి. తొలుత ఒక డాక్టర్ ఇచ్చిన సమాచారంతో ఫరీదాబాద్ అల్-ఫలాహ్ వర్సిటీలో పనిచేసే ముజమ్మిల్ దొరికాడు. అతడి ద్వారా లఖ్నవూలో షహీన్ అనే వైద్యురాలితోపాటు ఏడుగురు పట్టుబడ్డారు. ఆమె వాహనంలో AK-47 రైఫిల్ దొరికింది.
జమ్ముకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. అల్-ఫలాహ్ వర్సిటీ ఢిల్లీకి 45 కి.మీ. దూరంలోనే ఉంటుంది. దొరికిన అమ్మోనియం నైట్రేట్ వల్ల ఊహించని రీతిలో బాంబులు తయారు చేయవచ్చని పోలీసులు అంటున్నారు.