మత్తుపదార్థాల(Drugs)కు కేంద్రాలుగా మారిన పబ్బుల్లో భారీగా దందా నడుస్తుంటుంది. వీటిపై పోలీసులు దృష్టిపెట్టడంతో ఇప్పుడు భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. హైదరాబాద్ లోని కేవ్ పబ్ పై దాడి చేస్తే పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వచ్చాయి.
డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారంతో మణికొండలోని కేవ్ పబ్ పై పోలీసులు తనిఖీలకు దిగారు. TG న్యాబ్-రాయదుర్గం అధికారుల టీమ్ 50 మందిని అదుపులోకి తీసుకుంది. వారందరికీ టెస్టులు చేస్తే అందులో 24 మందికి పాజిటివ్ వచ్చింది.
DJ ఏర్పాటు చేయడంతోపాటు డ్రగ్స్ ను నిర్వాహకులు(Management) అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు. కోర్టులో హాజరుపర్చేముందు వీటిని అమ్మినవారి గురించి కూపీ లాగుతున్నారు ఖాకీలు.