హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసి సెలెబ్రిటీలను అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీలో భారీయెత్తున మాదక ద్రవ్యాలు(Drugs) పట్టుబడటం కలకలం రేపింది. హైదరాబాద్ మాదాపూర్ లో ఈరోజు తెల్లవారుజామున రేవ్ పార్టీపై దాడి చేసిన పోలీసులు.. పలువురిని అరెస్టు చేశారు. సినీ నిర్మాత వెంకట్ తోపాటు కొందరు ప్రముఖులు, అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు.. అందరినీ అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారన్న కోణంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. విఠల్ రావునగర్ లోని వైష్ణవి అపార్ట్ మెంట్ లో ఈ పార్టీ జరిగింది.
ఈ ఘటనలో మూవీ ప్రొడ్యూసర్ వెంకట్ తోపాటు మొత్తం ఐదుగురిని మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుల నుంచి పెద్దయెత్తున కొకైన్, LSDని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో ఇలా మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది.