హైదరాబాద్ లో గత మూడు రోజులుగా డ్రగ్స్ కలకలం రేపుతుండగా తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ యెత్తున మత్తు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో మాటు వేసిన DRI(డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు 5 కిలోల కొకైన్ పట్టుకున్నారు. దీని విలువ రూ.50 కోట్లు ఉంటుందని అంటున్నారు. సూట్ కేసు అడుగు భాగంలో బ్రౌన్ టేప్ తో చుట్టి డ్రగ్స్ ను తీసుకువస్తున్నారు. నలుగురు మహిళల హ్యాండ్ బ్యాగుల్లో తెలివిగా దాచిన కొకైన్ ను సప్లయ్ చేస్తూ DRI నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు.
లావోస్ నుంచి సింగపూర్, హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్తుండగా ప్రయాణికుణ్ని పట్టుకున్నారు. నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.