ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని సాహితి ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు మృత్యువాత పడగా, మరో ఐదుగురు గాయపడ్డారు. కంపెనీలోని రియాక్టర్ పేలి భారీ శబ్దం రావడం, ఉన్నట్టుండి పెద్దయెత్తున మంటలు ఎగిసిపడటంతో భయంతో కార్మికులు పరుగులు తీశారు. మంటలార్పుతున్న ముగ్గురు ఫైర్ సిబ్బందికి సైతం గాయాలయ్యాయి. బాధితులను విశాఖ కేజీహెచ్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఫార్మా చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించడంతో మిగతా కంపెనీలకు ప్రమాదం జరుగుతుందేమోనన్న ఆందోళన ఏర్పడింది.
ఫార్మా చుట్టూ పెద్దయెత్తున చెలరేగిన మంటల్ని కంట్రోల్ చేసేందుకు 11 ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. భారీ ఫోమ్ ఫైర్ ఫైట్ వెహికిల్ తో మంటల్ని ఆర్పుతున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులంతా అక్కడే ఉండి పరిస్థితిని పరిశీలించారు.