ఢిల్లీ లిక్కర్(Liquor) కేసులో అరెస్టయిన కవితను ఆమె భర్త అనిల్ తోపాటు KTR, హరీశ్ రావు కలిసి మాట్లాడారు. న్యాయపోరాటం చేద్దామంటూ ఈ ముగ్గురూ ఆమెకు ధైర్యం చెప్పారు. కస్టడీలోకి తీసుకున్న కవితను తొలి రోజు ED అధికారులు విచారణ జరిపారు. ఏడు రోజుల పాటు కొనసాగనున్న ఈ విచారణ ఈ నెల 23తో ముగుస్తుంది. అయితే కోర్టు ఆదేశాల(Directions) మేరకు ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు గంట పాటు కుటుంబ సభ్యులు, లాయర్లను కలుసుకునేందుకు అవకాశముంది. ఇందులో భాగంగానే భర్తతోపాటు సోదరుడు, బావను ఆమె కలుసుకున్నారు.
ఇంటి భోజనమే…
కవితకు మరో వెసులుబాటును కూడా న్యాయస్థానం(Court) కల్పించింది. ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు రౌస్ అవెన్యూ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు అరెస్టయి ఢిల్లీ తరలించినప్పటి నుంచి కస్టడీలోకి తీసుకునే వరకు ED ఆఫీస్ లోని ప్రత్యేక సెల్ లోనే కవితను ఉంచారు. కవిత కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉండగానే ఆమెను అరెస్టు చేశారు. ఇది కోర్టు రూల్స్ ను ఉల్లంఘించడమేనంటూ KTR సహా BRS లీడర్లు చెబుతూనే.. దీనిపై అక్కడే తేల్చుకుందామన్న భావన వారిలో కనపడుతున్నది.