
రైలులో ప్యాసింజర్స్ కు రక్షణగా ఉండాల్సిన RPF కానిస్టేబుల్.. కాల్పులు జరిపి నాలుగు ప్రాణాలు తీశాడు. కాల్పుల అనంతరం రైలు నుంచి దూకి నిందితుడు పారిపోతుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఈ ఘటన జయపుర-ముంబయి ఎక్స్ ప్రెస్ రైలులో జరిగింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF కానిస్టేబుల్ చేతన్ కుమార్… ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాల్పుల్లో మృతిచెందిన వారిలో RPF ASIతోపాటు ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటి వెళ్తున్న సమయంలో దుర్ఘటన జరిగింది.
ఫైరింగ్ అనంతరం దహిసర్ రైల్వే స్టేషన్ వద్ద ట్రెయిన్ దూకి నిందితుడు పారిపోవాలని చూశాడు. కానీ చేతన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.