మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 25 మంది సజీవ దహనమయ్యారు. సమృద్ధి మార్గ్ ఎక్స్ ప్రెస్ వేలో శనివారం అర్థరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో దుర్ఘటన జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు నాగపూర్ నుంచి పుణె వెళ్తుండగా టైరు పేలడంతో వెహికిల్ అదుపు తప్పింది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే అందులోని వారు ప్రాణాలు కోల్పోయారు. బస్సులోనే సజీవ దహనమయ్యారు.
మొత్తం 33 మంది జర్నీ చేస్తున్న బస్సులో 25 మంది మృతి చెందగా, మిగతా 8 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. బాధితుల్ని సమీప హాస్పిటల్స్ కు తరలించడంలో సాయపడ్డారు. ఈ దుర్ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. అగ్నికి ఆహుతైన మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం అక్కడివారిని కలచివేసింది.