
బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన డిసెంబరు 6న దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నాగం పన్నారు. ఢిల్లీలోని 6 లొకేషన్లు గుర్తించి కార్లను రెడీ చేశారు. ఇప్పటికే i20 పేలగా, మిగతా నాలుగు వాహనాలు సిద్ధమయ్యాయి. ఆ కార్లు పాతవి కాగా వాటిని పలు దఫాలుగా అమ్మినవాటినే ఎంచుకున్నారు. పోలీసులు గుర్తించకుండా చేసేందుకే పాత కార్లను తీసుకున్నారు. మిగతా 3 కార్లను అల్-ఫలాహ్ యూనివర్సిటీలో పోలీసులు గుర్తించారు. ఉగ్రవాద సంస్థలతో నేరుగా కార్యకలాపాలు నడిపేందుకు ఆ వర్సిటీనే కీలకంగా చేసుకున్నట్లు NIA దర్యాప్తులో తేలింది.