![](https://i0.wp.com/justpostnews.com/wp-content/uploads/2023/07/FRUAD.jpg?resize=640%2C427&ssl=1)
వయసు 35 ఏళ్లు… అచ్చిరాని ఇంగ్లీషులో మాట్లాడతాడు… ఇంకేముంది డాక్టర్, ఇంజినీరంటూ ప్రచారం…. అన్నిట్లో బాగానే ఉన్నాడు కదా అని ఆకర్షితులైతే… బుట్టలో వేసుకోవడం, మ్యారేజ్ చేసుకోవడం. ఇలా సాగుతోంది కర్ణాటకకు చెందిన ఓ ప్రబుద్ధుడి స్టోరీ. 2014 నుంచి ఇప్పటివరకు 15 పెళిళ్లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరులోని బాణాశంకరి ప్రాంతానికి చెందిన మహేశ్ కె.బి.నాయక్ అనే వ్యక్తి… తుమకూరులో ఫేక్ క్లినిక్ నడుపుతూ మహిళల్ని మోసం చేస్తున్నాడు. ఇప్పటివరకు 15 మందిని మ్యారేజ్ చేసుకోగా… నలుగురు సంతానం కలిగారు.
మాట్రిమోనియల్ సైట్స్ లో వెతకడం… యువతులు, మహిళల్ని బుట్టలో వేసుకోవడమే టార్గెట్ గా ఛీటింగ్ చేస్తున్నాడు. నకిలీ క్లినిక్ ఓపెన్ చేసి, నర్స్ ను ఎగ్జాంపుల్ గా చూపిస్తూ వ్యవహారం సాగించేవాడు. తుమకూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇచ్చిన కంప్లయింట్ తో పోలీసులు కూపీ లాగారు. తను మనువాడిన మహిళలు కూడా అంత సామాన్యులేం కాదండోయ్. అందరూ మంచి విద్యావంతులు, ప్రొఫెషనల్ ఎంప్లాయిసే. అయితే వాళ్లను అప్పుడప్పుడు మాత్రమే కలిసేవాడు. డబ్బు కోసం భార్యలపై ఆధారపడకపోవడమే ఆ ఛీటర్ కు అలా కలిసివచ్చింది.
అసలు విషయమేంటంటే ఈ 15 మందే కాకుండా ఎంతోమందిని బుట్టలో వేసుకోవాలని చూశాడట. కానీ అతడి అచ్చీరాని పిచ్చి ఇంగ్లీషును భరించలేక చాలా మంది ఛీకొట్టారు. మహేశ్ తమ దగ్గరకు రావడం లేదని కంప్లయింట్ ఇద్దామంటే పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆ సతీమణులు ముందుకు రాలేకపోయారు. అయితే మైసూరుకు చెందిన మహిళ జనవరిలో ఇచ్చిన కంప్లయింట్ తో ఎంక్వయిరీ స్టార్ట్ అయింది. క్లినిక్ ను డెవలప్ చేసేందుకు డబ్బులు, నగలు ఇవ్వాలంటూ హింసిస్తుండటంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని అరెస్టు చేశారు.