హైదరాబాద్ మియాపూర్ సమీపంలోని హోటల్ లో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ జనరల్ మేనేజర్(GM) దేవేందర్ మృతి చెందారు. మదీనాగూడలోని సందర్శిని హోటల్ లోకి ప్రవేశించిన దుండగుడు.. ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు. హోటల్ GM దేవేందర్ పై కాల్పులు జరపడంతో.. వెంటనే హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు 6 బుల్లెట్లను స్వాధీనం(Recovery) చేసుకున్నారు. బుధవారం రాత్రి జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దృష్టిసారించారు.
సాయంత్రం నుంచి రాత్రి హోటల్ మూసివేసేవరకు ఆ ప్రాంతం ఎప్పుడూ రద్దీ ఉంటుంది. మరోవైపు మియాపూర్-చందానగర్ మెయిన్ రోడ్డుపైనే సందర్శిని హోటల్ ఉంటుంది. ఎప్పుడూ జనంతో కనిపించే హోటల్ లో కాల్పులు జరగడం సంచలనానికి కారణమైంది.