విదేశాల నుంచి వస్తున్న ప్యాసింజర్స్ ని సునిశితంగా తనిఖీలు నిర్వహిస్తున్న ఎయిర్ పోర్ట్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈమధ్యకాలంలో పెద్దయెత్తున బంగారం పట్టుబడటం చూస్తేనే అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో తెలియజేస్తోంది. సోమవారం రూ.1.27 కోట్ల విలువైన 1.93 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్యాప్సూల్స్ రూపంలో వాటిని తీసుకువస్తూ నిందితులు పట్టుబడ్డారు. దుబాయి, జెడ్డా నుంచి వస్తున్న విమానాల ద్వారా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న సమాచారంతో మాటు వేసిన అధికారులు… ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకుని బంగారాన్ని స్వాధీనపరచుకున్నారు.