నగల దుకాణ దోపిడీకి వచ్చి కాల్పులు జరిపిన ఘటన హైదరాబాద్ చందానగర్(Chanda Nagar)లో జరిగింది. ఖజానా జువెల్లరీలో దాడికి వచ్చిన దుండగులపై సిబ్బంది ఎదురుదాడికి దిగారు. ప్రతిఘటన ఎదురవడంతో కాల్పులు జరిపి అందర్నీ భయపెట్టారు. ఆరుగురు దొంగలు అక్కడకు వచ్చారని అనుమానిస్తున్నారు. ఈ కాల్పుల్లో దుకాణంలోని ఒకరి కాలికి గాయమైంది. అయితే అంతకుముందే దుండగులు.. CC కెమెరాల్ని ధ్వంసం చేశారు. లాకర్ తాళాలు ఇవ్వకపోవడంతో కౌంటర్లు, స్టాళ్లు ధ్వంసం చేసి నగలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వస్తున్నారని తెలిసి ముసుగు దొంగలు పారిపోయారు.