
వీసా గడువు ముగిసి అక్రమంగా ఉంటున్న విదేశీయులతో జాగ్రత్త అని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. మెడికల్, స్టూడెంట్, బిజినెస్ వీసాల పేరిట ఇక్కడే తిష్ఠ వేశారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ అనుమానం వస్తే హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(H-NEW) హెల్ప్ లైన్ 8712661601కు కాల్ చేయాలన్నారు.
నైజీరియాకు చెందిన జాన్ కెనడీ ఒకారో 2012లో బిజినెస్ కోసం వచ్చాడు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని గుర్తించి అరెస్ట్ చేశారు. అతడు హైదరాబాద్-బెంగళూరు తిరుగుతున్నాడని గుర్తించి నిఘా పెట్టారు. ఈజీ మనీ కోసం డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడ్డాడు.