ఆయన మొన్నటి దాకా మంత్రిగా పనిచేసిన వ్యక్తి. పార్టీ అధికారం కోల్పోవడంతోపాటు ఏకంగా ఆయన సైతం MLAగా ఓడిపోయారు. అయితే తనకు ప్రాణహాని ఉన్నందున 4+4 గన్ మెన్ ను కేటాయించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు… ఆ స్థాయిలో ఇచ్చుకుంటూ పోతే ఎంతమందికి సెక్యూరిటీ ఇవ్వగలం అంటూ విచారణను వాయిదా వేసింది.
శ్రీనివాస్ గౌడ్ కు చుక్కెదురు…
గన్ మెన్(Gunmen)ను కేటాయించాలంటూ ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన అభ్యర్థనను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా భద్రత కేటాయించడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. ఆయనకు గన్ మెన్ అవసరమో లేదో తెలపాలంటూ DGPని ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
అప్పుడు ఊరట…
2018 ఎలక్షన్లలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందున శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ ఆయనపై మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేందర్ రాజు పిటిషన్ వేశారు. దీనిపై అప్పుడు కేసు ఫైల్ కాకపోవడంతో మంత్రి విషయంలో ఉదాసీనత చూపిస్తున్నారంటూ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు.. మహబూబ్ నగర్ పోలీసులకు షాకిచ్చింది. కేసు నమోదు చేయాలని ఆదేశించడంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సహా 11 మందిపై కేసు ఫైల్ అయింది. దీనిపై CECతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నారు. సుదీర్ఘకాలం ఇరుపక్షాల తరఫు వాదనలు విన్న కోర్టు… పిటిషన్(Petition)ను కొట్టేయడంతో శ్రీనివాస్ గౌడ్ కు అప్పుడు ఊరట లభించింది.