హైదరాబాద్ బాంబు పేలుళ్ల(Bomb Blasts) కేసులో ఐదుగురు దోషుల అప్పీలును కొట్టివేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లపై NIA కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయగా… జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి.సుధ బెంచ్ నెలన్నర పాటు విచారణ చేపట్టి డిస్మిస్ చేసింది. 2013 ఫిబ్రవరి 21న బాంబు పేలుళ్లు జరగ్గా 2016 డిసెంబరు 19న ఐదుగురికి ఉరిశిక్ష పడింది. ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన ముష్కరులు జరిపిన పేలుళ్లలో 18 మంది మృతిచెందగా, 131 మంది గాయపడ్డారు. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉండగా, మిగతా ఐదుగురికి మాత్రం శిక్ష పడింది.