రెండోసారి బయోమెట్రిక్(Biometric) సమస్య ఎందుకు వచ్చిందన్న హైకోర్టు(High Court)… గ్రూప్-1 ఎగ్జామ్ ను మళ్లీ నిర్వహిస్తే అభ్యంతరమేంటని TSPSCని ప్రశ్నించింది. రెండోసారి నిర్వహించిన పరీక్షను 50 వేల మంది రాయలేదని.. వ్యవస్థపై నమ్మకం లేకే వారంతా ఎగ్జామ్స్ రాయలేదని స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ TSPSC(Telangana State Public Service Commission) దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు కొనసాగాయి. ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు… కమిషన్ తీరుపై పలు ప్రశ్నలు సంధించింది.
ముగ్గురి కోసం రద్దు చేయడమా..
ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పిటిషన్ వేశారని, ఆ ముగ్గురి కోసమే పరీక్ష రద్దు చేయడం సరికాదని అడ్వొకేట్ జనరల్(AG) వాదించారు. బయోమెట్రిక్ పెట్టడం, పెట్టకపోవడమన్నది TSPSC నిర్ణయాధికారం కిందకు వస్తుందని, నిబంధనలు సరిచేసుకునే వెసులుబాటు కమిషన్ కు ఉందని AG అన్నారు. దీనిపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. కాసేపట్లో హైకోర్టు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వనుంది.