
ముజమ్మిల్ షకీల్ అనే డాక్టర్ ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు(Explosives) పట్టుబడ్డాయి. ఆయన అద్దె నివాసంలో 350 కిలోలు, ఇంకో ఇంట్లో 2,563 కిలోల అమ్మోనియం నైట్రేట్ దొరికింది. హరియాణా ఫరీదాబాద్ ధోజ్ లోని అల్-ఫలాహ్ వర్సిటీలో అతడు పనిచేస్తున్నాడు. ఇది ఢిల్లీకి 45 కి.మీ. దూరంలోనే ఉంటుంది. 20 టైమర్ బాంబులతోపాటు అసాల్ట్ రైఫిళ్లు, హ్యాండ్ గన్స్ పట్టుబడ్డాయి. జమ్ముకశ్మీర్ పుల్వామాకు చెందిన షకీల్.. వైట్ కాలర్ ముసుగులో ఉగ్రకుట్ర చేస్తున్నట్లు గుర్తించారు. జమ్ముకశ్మీర్, గుజరాత్, హరియాణాలో ఏకకాలంలో దాడులు చేశారు.