హైదరాబాద్ IITకి చెందిన విద్యార్థి అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. విశాఖపట్నం సమీపంలో సముద్రంలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్(21) IITHలో బీటెక్(మెకానికల్) సెకండియర్ చదువుతున్నాడు. ఈ నెల 17న క్యాంపస్ నుంచి కనిపించకుండా పోగా 19 నాడు అతడి పేరెంట్స్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఆ యువకుడు విశాఖ వెళ్లినట్లు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు.
ఆచూకీ కోసం గత వారం రోజులుగా పోలీసులతోపాటు IITH క్యాంపస్ అధికారులు విస్తృతంగా గాలించారు. వారం రోజుల తర్వాత మంగళవారం నాడు కార్తీక్ మృతదేహం లభ్యమైంది. దీంతో ఈ ఘటన విషాదాంతం కాగా మృతదేహాన్ని KGHకు తరలించారు.