అవినీతి నిరోధక శాఖ అధికారుల దూకుడు పెరిగింది. గత రెండ్రోజుల్లో ముగ్గురు అధికారుల్ని పట్టుకున్నారు. పూర్తయిన పనుల్ని తనిఖీ చేసి నమోదు చేయడానికి రూ.11 వేలు లంచం తీసుకుంటుండగా నీటిపారుదల డిప్యూటీ EE దొరికిపోయారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సబ్ డివిజన్-4 DEEగా పనిచేస్తున్న డి.శ్రీకాంత్ నాయుడు.. డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటుండగా అరెస్టయ్యారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లాలోనే అదే ఇరిగేషన్ శాఖలో AEE మహ్మద్ ఫయాజ్.. రూ.3 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇక జగిత్యాల జిల్లా రవాణాధికారి(DTO) భద్రునాయక్, ఆయన డ్రైవర్ బాణోత్ అరవింద్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.